సృజనా స్కూల్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విద్యార్థుల ర్యాలీ.

సృజనా స్కూల్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విద్యార్థుల ర్యాలీ.

మధురవాడ:

మధురవాడ :  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా  ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  కార్యక్రమంలో భాగంగా మహా విశాఖ 6 వార్డు పరిధి పీఎం పాలెం చివరి బస్ స్టాప్ వద్ద గల సృజనా స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. 

ఈ మేరకు పాఠశాల ఆవరణ నుండి పీఎం పాలెం 2 వ బస్ స్టాప్ వరకు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో ర్యాలీ సాగింది. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ షరీఫ్ మాట్లాడుతూ భారతదేశ అవునత్యాన్ని , స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలిసే విధంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులు దేశభక్తి కలిగి ఉండేలా  ఈ ర్యాలీలు దోహదపడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనురాధ, ఉపాధ్యాయులు ప్రసాదరావు, మనీ, రామానంద్, తదితరులు పాల్గొన్నారు.