చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలుగు భాష దినోత్సవం
మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్:తెలుగు భాష దినోత్సవం, సోమవారం గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యమ్.రాజబాబు, ఎ. జయప్రద, పాఠశాల కమిటీ చైర్మన్ బుడుమూరి మీనా, ఉపాధ్యక్షులు కిల్లాన పోలినాయుడు, కో ఆప్షన్ సభ్యులు పిళ్లా సూరిబాబు, యన్. వి. జ్యోతీష్, సభ్యులు ఇయ్యపు ఎర్రి నాయుడు, బి. సంతోష్ కుమారి, యన్. జ్యోతి, చంద్రిక, యమ్. శ్యామల, పి.డి. రాము, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు, వక్తలు మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు గారు మూడు దశాబ్దాల పాటు తెలుగు భాష అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు, మనకు వాడుకలో ఎన్ని భాషలు ఉన్న అన్ని భాషల కన్నా తెలుగు భాష మిన్న, ఎన్ని భాషల్లో విద్య అభ్యసించిన తెలుగు భాషను మాత్రం మరువరాదు, ఎందుకంటే మన తెలుగు భాషకు ఉన్న గొప్పదనం అలాంటిది, కన్న తల్లి, ఉన్న ఊరు, మన మాతృ భాషను ఎట్టి పరిస్థితుల్లోను మరువరాదు అన్నారు.