విశాఖపట్నంలో వినూత్న పట్టణాభివృద్ధి ప్రభావాలపై :ఫోటోగ్రఫీ పోటీ పోస్టర్ ఆవిష్కరణ
విశాఖపట్నం:
విశాఖపట్నం, ఆగస్టు–4:- సిటీస్ (CITIIS) కార్యక్రమం కింద నేషనల్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) పౌరుల యొక్క దృక్కోణంలో
భారతదేశంలోని వినూత్న ఆవిష్కరణలతో నడిచే పట్టణ అభివృద్ధి యొక్క
ప్రభావాలను వివరించే ఉద్దేశ్యంతో “Cities of Tomorrow” అనే ఫోటోగ్రఫీ
పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీకి సంభందించిన పోస్టర్ ను నగర మేయర్
గొలగాని హరి వెంకట కుమారి, జివిఎంసి కమీషనర్ డాక్టర్ జి లక్ష్మీశ
ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ ఎస్ ఎస్ వర్మ, చీఫ్
ఇంజనీర్ రవికృష్ణ రాజుతో పాటు జివిఎంసి అధికారులు, ఎన్ఐయుఎ ప్రతినిధులు
మరియు స్మార్ట్ సిటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంలో వారిరువురూ మాట్లాడుతూ ఈ పోటి లో బహిరంగ ప్రదేశాలు,
సస్టైనబుల్ మొబిలిటీ, ఈ-గవర్నెన్స్ మరియు సామాజిక
ఆవిష్కరణ అనే 4 థీమ్స్ నుండి ఆహ్వానాలను స్వీకరిస్తున్నారు. ఈ 4 థీమ్
లలో ఏ థీమ్ నుండి అయిన 3 ఫొటోస్ లను ఈ పోటీకి పంపించవలసి వుందని వారు
తెలిపారు.
ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్లు మిస్టర్ రఘు రాయ్, శ్రీమతి కేతకీ సేత్
మరియు మిస్టర్ సౌనక్ బెనర్జీలతో కూడిన ప్యానెల్ ఆధ్వర్యంలో ఎంపిక
జరుగుతుందని, మొదటి బహుమతి రూ. 50,000/- రెండవ బహుమతి రూ. 25,000/- మరియు
మూడవ బహుమతి రూ. 10,000/- లను బహుమతులుగా అందజేస్తారు. విజేత ఎంట్రీలు
అక్టోబర్ 2022లో న్యూ ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో జరిగే
పబ్లిక్ ఎగ్జిబిషన్‌లో కూడా ప్రదర్శించబడతాయని తెలిపారు.
ఈ పోటిలో పాల్గొనటానికి చివరి తేది ఆగష్టు 26, 2022. మరిన్ని వివరాల
కోసం ఈ వెబ్ సైట్ ను చూడండి https://niua.in/citiis/citiis-photos-competition.