గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో అవంతి
భీమిలి నియోజకవర్గం జీవియంసి 5వ వార్డు వివేకానంద నగర్ 1 లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో స్థానిక శాసనసభ్యుడు విశాఖ జిల్లా అధ్యక్షులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కి ప్రజలు రక్షాబంధన్ సందర్భంగా అవంతి శ్రీనివాస్ రావు కి ఆడపడుచులు రక్షాబంధన్ కడుతూ స్వాగతం పలికారు.అనంతరం 5వ వార్డు లో సద్గురు సాయి నాథ్ కోలనీ - గాంధీ నగర్ - ముత్యాలమ్మ కోలనీ లో 320 ఇంటింటి కి తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగరూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించే పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయని ప్రతీ ఒక్కరు సంతోషం తో చెప్పడం జరిగింది.అనంతరం ఆయన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగారు1) గాంధీ నగర్ లో రెండు చోట్ల సిసి రోడ్డు వేయాలని2)ముత్యాలమ్మ కోలనీ లో 7 విద్యుత్ స్తంభాలు వేయాలని 3) వీధి లైట్లు - డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని 4)సద్గురు సాయి నాథ్ కోలనీ లో 450 ఇళ్ళు కి త్రాగునీటి సౌకర్యార్థం ఇంటింటికి కొళాయిలు వేయాలని 5) సంవత్సరాలు తరబడి నివసిస్తున్న ఇళ్ళు కు పట్టాలు ఇప్పించాలని 6) పలు కారణాల చేత అందని సంక్షేమ పథకాలు సమస్య పరిష్కారం చేసి అందించాలని సమస్యలు విన్న అవంతి శ్రీనివాసరావు వెంటనే స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ.
ఈ కార్యక్రమంలో చినగదిలి ఎమ్ ర్ ఓ జీవీఎంసీ కమిషనర్ బొడ్డేపల్లి. రాము, మాజీ కార్పోరేటర్ పోతిన. హనుమంతరావు,7వ వార్డ్ అధ్యక్షులు పోతిన.శ్రీనివాసరావు, చేకూరి. రజిని, బాబ్జి, సచివాలయం సిబ్బంది, తదితరులు అధికారులు పాల్గొన్నారు