మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శ్రావణ వరలక్ష్మి వ్రతం పూజలు.
జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజలు .మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు మీద కొలువైవున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు శుభకృత్ నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్ల పక్షం తిథి అష్టమి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి నిత్యార్చనతో పూజలు ప్రారంభించి, ప్రత్యేక కుంకుమార్చన, పుష్పార్చన, మొదలగు పూజ కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు, పట్నాల సుబ్బారావు శర్మ, ,పట్నాల హరి ప్రసాద్ శర్మ, పట్నాల రాంబాబు శర్మ, హరి చరణ్,హరి స్వామి, శంకర్ స్వామి తదితరులు జరిపించడం జరిగింది, మరియు సాయంత్రం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిపించడం జరిగింది, అనంతరం పంచామృత సుగంధ జలాభిషేకం జరిపించి, ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది,మధురవాడ చంద్రంపాలెం వాస్తవ్యులు పిళ్లా వెంకటరమణ, అక్కమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు ఆర్ధిక సహాయం ఏర్పాటు చేసిన పులిహోర ప్రసాదమును భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేయడం జరిగింది, అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా కృష్ణంనాయుడు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, యస్. రాంబాబు, పిళ్లా మోహన్ శివ కృష్ణ, ,కేశనకుర్తి అప్పారావు, డిసోంబాబు, బంక వాసు, పిళ్లా సన్యాసిరావు, దుక్కి వరం, గ్రామ పెద్దలు పీస రామారావు, జగుపిల్లి నాని,ముఖ్య సభ్యులు పిళ్లా అప్పన్న, జగుపిల్లి సురేష్, పిళ్లా పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.