ముఖ్యమంత్రి రాక,సీపీఎం నాయకులు పి రాజు కుమార్ అరెస్టు..
సీపీఎం నాయకులు పై.పి ఎం పాలెం పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు.ఆ పార్టీ నగర నాయకులు ఆర్ పి రాజు హఠాన్మరణంతో సీపీఎం తీవ్ర దిగ్భ్రాంతి లో వుండి,ఆ కార్యక్రమంలో పాల్గనడానికి వెళుతున్న సమయంలో, చెపుతున్న వినకుండా పి రాజ్ కుమార్ అరెస్టు చేయడం దుర్మార్గం అని,ఈ అరెస్టులను ఖండిస్తున్నట్లు సీపీఎం మధురవాడ జోన్ కమిటీ తెలియ చేసింది.
ఈ సందర్భంగా పత్రికా ప్రకట విడుదల చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన ప్రతి సారి వామపక్ష పార్టీల నాయకుల ను ఇలా అరెస్టులు చేయడం మానుకోవాలని హితవు పలికారు.ప్రజా సమస్యల పోరాడే వారిని ఎంతకాలం ఇలా నిర్బంధించి ఆపగలరాని ప్రశ్నించారు. ఇటువంటి నిర్బంధాలు ఆపాలని కోరారు.