ఐదో వార్డ్ నగరంపాలెంలో కొత్త పెన్ష్న్లు పంపిణీ చేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత

ఐదో వార్డ్ నగరంపాలెంలో కొత్త పెన్ష్న్లు పంపిణీ చేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత 

మధురవాడ:

మధురవాడ: l కొత్తగా మంజూరైన వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లను ఐదో వార్డ్ కార్పొరేటర్ అయినా మొల్లి హేమలత నగరం పాలెం లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. నగరంపాలెం గ్రామంలో పర్యటిస్తూ అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ వీధిలైట్లు ఒక సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు ఆమెకు తెలిపారు. వెంటనే కార్పొరేటర్ మొల్లి హేమలత సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
మరియు సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అర్హులైన ఏ ఒక్కరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే నాకు తెలపాలని వెంటనే నేను సంబంధిత అధికారులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ తరుణ్ కుమార్, సచివాలయ వాలంటీర్లు మరియు గ్రామస్తులు నాగోతి అనిత, ఇల్లిపిల్లి అప్పారావు (వెంగళరావు), నాగోతి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.