మున్సిపల్ షాపులను సత్వరమే నిర్మాణం చేయాలి..!అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకి కార్పొరేటర్ గంటా అప్పలకొండ వినతి
భీమిలి జోన్:
భీమిలి జోన్ 3వ వార్డు మెయిన్ రోడ్డులో పడగొడుతున్న పాత మున్సిపల్ షాపుల స్థానంలో సత్వరమే కొత్తవి నిర్మాణం చేయుటకు తగిన ప్రణాళిక రూపొందించే విధంగా చేయాలని జీవిఎంసీ అధికారులను, స్థానిక శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావులను 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ కోరారు.భీమిలి మెయిన్ రోడ్డులో పడగొడుతున్న షాపులను కార్పొరేటర్ గంటా అప్పలకొండ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజుతో కలసి స్వయాన వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గంటా అప్పలకొండ తగు సూచనలను ఇవ్వడమైనది.
మెయిన్ రోడ్డు నిత్యం రద్దీగా ఉండటం, అందులో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో ఇంకా ఎక్కువ జనాలు మార్కెట్ కోసం వచ్చే అవకాశం ఉంది. అందువలన మట్టిని తొలగించేటప్పుడు, మెషిన్ తో భవనాలు పడగొట్టేటప్పుడు ప్రజలకు ఎటువంటి అపశృతి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొనే విధంగా సూచనలు చేయడం అయింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ద తీసుకొని పాత షాపుల స్థానంలో కొత్తవి నిర్మాణం చేసి స్థానిక నిరుద్యోగులకు మరియు ఇంతకుముందు వ్యాపారం చేసుకున్న వారికి జీవిఎంసీ నియమ నంబందనలు ప్రకారం షాపులను కేటాయించాలని కార్పొరేటర్ గంటా అప్పలకొండ కోరారు.