స్కానింగ్ పని చెప్పీ పని వొత్తిడి పెంచోద్దు సీఐటీయూ

స్కానింగ్ పని చెప్పీ పని వొత్తిడి పెంచోద్దు సీఐటీయూ

మధురవాడ:

అభివృద్ధి చెందుతున్న విశాఖ ప్రజలు,నివాస ప్రాంతాలు విపరీతంగా పెరుగుతున్న పారిశుధ్య కార్మికుల ను మాత్రం పెంచకుండా అదనంగా రోజు చేసే పనితో పాటు,స్కానింగ్ మీషన్ పని  చెయ్యమని ఒత్తిడి చేయడం ఆపాలని మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంగం సీఐటీయూ డిమాండ్ చేసింది.6 వ వార్డు మధురవాడ వద్ద ప్లే కార్డులు ప్రదర్శించి  కార్మికులు నిరసన తెలియజేశారు. సీఐటీయూ జోన్ ప్రధాన కార్యదర్శి పీ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే కార్మికులు చాలక వున్న పనిభారం అంతా కార్మికులు భరిస్తున్నారు అని అన్నారు.అదనంగా స్కానింగ్ చేసే పని కూడా చెయ్యమనడం అన్యాయంగా వుందని అన్నారు ఇప్పటికే పేర్లు మార్చుకునే కార్మికులు,చనిపోయిన కార్మికుల పోస్టులు,వివిధ అనారోగ్యంతో దీర్ఘ కాలం సెలవులో వున్న వారి ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్.కొత్త కార్మికులను నియమించాలని కోరారు యెట్టి పరిస్థితుల లోనూ అదనంగా స్కానింగ్ చేసే ప్రసక్తే లేదని అన్నారు.అధికారులు కార్మికులపై వొత్తిడి చేసి ఇబ్బంది పెట్టవద్దని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జీ కిరణ్,ఎం జాన్, బి రాంబాబు,సి హెచ్ శ్రీను,కే అచ్చియ్యమ్మా,డి వరలక్ష్మి,పప్పి తదితరులు పాల్గొన్నారు.