పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ బిసి లకు కేటాయించాలని విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కి వినతిపత్రం

పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ బిసి లకు కేటాయించాలని విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు  పల్లా శ్రీనివాసరావు కి వినతిపత్రం

విశాఖ:

ఉత్తరాంద్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్తానం నుంచి పోటీచేసేందుకు తనకు అవకాశం కల్పించాలని గొర్లె శ్రీనివాస నాయుడు పల్లా శ్రీనివాసరావు ని కోరారు. ఉత్తరాంద్ర జిల్లాలో అత్యధిక జనాభా గల వెనుకబడిన తరగతులకు చెందిన నాకు పార్టీ తరుపున  అవకాశం కల్పించాలని ఆంద్రప్రదేశ్ బిసి సంఘం నాయకులు మరియు టిడిపి  దక్షిణ నియోజకవర్గ నాయకుల తో కలసి వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో  పొలారాజు, సత్యనారాయణ, డొకర రమణ ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కమన వెంకట సుంబ్బారావు, బిసి పార్లమెంట్ అధ్యక్షులు పల్లా రమణ మొదలగువారు పాల్గొన్నారు.