కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

 కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో  వినాయక చవితి వేడుకలు

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

మధురవాడ ఏడవ వార్డు కళనగర్ లో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో  వినాయక చవితి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏడవ వార్డు వైసీపీ మహిళా అధ్యక్షురాలు చేకూరి రజిని విచ్చేసారు.అలాగే వాంబే కొలనిలో పలు గణపతి పూజ లో పాల్గొని ప్రసాదం సిక్కరించారు..

ఈ సందర్భంగా చేకూరి. రజిని మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. హిందూధర్మశాస్త్రాలు ప్రతిరోజూ వేద శ్లోకాలు , ప్రార్థనలు, పూజలు జరుగుతాయి. అని తెలిపారు

ఈ కార్యక్రమంలో : నవీన్ ఆటో, ప్రేమ్, పోతిన.గణేష్,నాగోతి. వాసు, నవీన్ రెడ్డి, వాండ్రసి.కనకరాజు,పోతిన తరుణ్,నాగోతి. అఖిల్, పోతిన, రాకేష్,వాండ్రసి.వెంకట్ మహిళలు మహాలక్ష్మి, నాగోతి. అఖిలేశ్వరి,నాగోతి. పద్మ, పిళ్ళా. రామ, గూడేళ్ల లక్ష్మి,దుక్క.మని ,తదితరులు పాల్గొన్నారు