మూర్తి యాదవ్ కు శుభాభినందనలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
విశాఖపట్నం:విశాఖ లోకల్ న్యూస్
విశాఖ నగరానికి తలమానికమైన రుషికొండ విధ్వంసాన్ని నిలువరించడానికి మూర్తి యాదవ్ చేసిన ప్రజా, పోరాటం ప్రశంసనీయం అని 22వ వార్డ్ కార్పోరేటర్ మూర్తి యాదవ్ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
జనసేన పక్షాన విశాఖ నగరపాలక సంస్థకు కార్పొరేటర్ గా ఎన్నికైన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి మూర్తి యాదవ్ చేస్తున్న కృషి విశాఖ నగరవాసులు, జనసేన పార్టీ మెచ్చుకునే స్థాయిలో ఉందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. పచ్చదనాన్ని కప్పిపుచ్చుకుని పర్యావరణాన్ని పదిలంగా దాచుకున్న రుషికొండను ధ్వంస చేస్తున్న పాలకులను నిలువరించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు గట్టి సంకల్పం, మనోధైర్యం ఉండాలి. ఆ రెండు లక్షణాలు మూర్తి యాదవ్ లో పుష్కలంగా ఉన్నాయి. రుషికొండతోపాటు ఆంధ్రా యూనివర్సిటీలో చెట్ల నరికివేత, నీటి కుంటల పూడ్చివేతపై హైకోర్టులో మూర్తి యాదవ్ చేస్తున్న న్యాయపోరాటం అభినందనీయం. కాలుష్యం కోరలకు చిక్కుకున్న విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణకు మీవంటి యువకుల అవసరం ఎంతో ఉంది. విశాఖ నగరంలో పర్యావరణాన్ని విస్మరిస్తే భవిష్యత్తు తరాల వారికి కనీసం మంచి గాలి, మంచి నీరు కూడా అందని భయానక పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. దీనిని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజా సమస్యలు, పర్యావరణ పరిరక్షణకు మీ కృషి ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలతోపాటు యావత్తు పార్టీ మూర్తి యాదవ్ కు అండగా ఉంటుందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హామీ ఇస్తు మూర్తి యాదవ్ కు నా పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలిపారు.