చంద్రంపాలెం శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ

చంద్రంపాలెం శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ 

మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్

పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన, పాస్టా పారీస్ నిర్మూలన లో భాగంగా చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో స్వాతి ప్రమోటర్స్  మేకపాటి కృష్ణారెడ్డి గారి ధన సహాయంతో ఏర్పాటు చేసిన ఐదు వందల వినాయక మట్టి విగ్రహాలు, వినాయక వ్రతకల్పము పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు, చంద్రంపాలెం గ్రామ పెద్దలు, స్వాతి ప్రమోటర్స్ సంస్థ సభ్యులు  అమ్మవారి ఆలయానికి భక్తులు అందరికీ పంపిణీ చేయడం జరుగింది, 

ముందుగా ఆలయ అర్చకులు పట్నాల రాంబాబు శర్మ అమ్మవారి ఆలయంలో వినాయక మట్టి విగ్రహాన్ని పెట్టి పూజ చేసిన అనంతరం విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు ఉపాధ్యక్షులు పి.వి.జి. అప్పారావు, యస్. యన్.మూర్తి,  సెక్రటరీ నాగోతి తాతారావు,  కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు,  సభ్యులు పిళ్లా వెంకట రమణ, పోతిన పైడిరాజు, బైపిల్లి సురేష్, పోతిన శివ అప్పారావు, యస్.ఆర్.బాబు, కేశనకుర్తి అప్పారావు,  బంక వాసు, గూడేల రాజు, గ్రామ పెద్దలు పీస రామారావు, ముఖ్య సభ్యులు పి.వి.రమణమూర్తి, జగుపిల్లి అప్పారావు, పిళ్లా సూరి పాత్రుడు,పి.రాంబాబు, పిళ్లా రాజు, పి‌. తమ్మునాయుడు మరియు స్వాతి ప్రమోటర్స్ సంస్థ సభ్యులు జె. సూర్యారావు, లక్ష్మణ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు,వక్తలు మాట్లాడుతూ కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ రానున్న వినాయక చవితి రోజున మట్టి వినాయక విగ్రహాలు ఇళ్లల్లో పెట్టి పూజించాలని కోరారు, ప్లాస్టిక్,  పాస్టా పారీస్ విగ్రహాలకు నీటిలో కరిగే గుణం లేక పోవుట వలన వాటి వలన కాలుష్యం పెరిగి పర్యావరణాన్ని దెబ్బ తీస్తుందని అన్నారు,