తక్షణమే ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలి: బుడిమూరి గోవింద్
ఎమ్. వి.పి : విశాఖ లోకల్ న్యూస్
తెలుగుదేశం పార్టీ ఆదేశాలు మేరకు విశాఖ పార్లమెంట్ ఎస్ సి అధ్యక్షులు బుడిమూరి గోవింద్ ఆధ్వర్యంలో ఎమ్.వి.పి కాలనీ లో ఉన్న ఎస్ సి కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు కార్యకర్తలు నిరాశ ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ ధర్నాలో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో ప్రెవేశ పెట్టినటువంటి సంక్షేమ ఫలాలను ఈ జగన్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసినందుకు గాను మరియు మాల మాదిగ రెల్లి, కార్పొరేషన్ గా విభజించి వీరికి రావలసిన నిధులు కేటాయించకపోవడం పై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమం లో విశాఖ పార్లమెంట్ ఎస్ సి సెల్ల్ అధ్యక్షులు బుడిమూరి గోవింద్ మాట్లాడుతూ తక్షణమే ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, రాష్ట్ర ఎస్ సి సెల్ ప్రధాన కార్యదర్శి పొడుగు కుమార్, ఎస్ సి సెల్ల్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జాన్ , రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత,భీమిలి ఎస్ సి సెల్ల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు, తూర్పు ఎస్ సి సెల్ల్ అధ్యక్షులు పట్టా నూకరాజు, సౌత్ ఎస్ సి సెల్ల్ అధ్యక్షులు చెన్న అశోక్, నార్త్ ఎస్ సి సెల్ల్ అధ్యక్షులు గంట్యాడ ఆదినారాయణ,పార్లమెంట్ ఎస్ సి సెల్ అధికార ప్రతినిధి గాడి సత్యం, పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్ల ఈశ్వరావు, పార్లమెంట్ ఎస్ సి సెల్ కార్యదర్శి బట్టాన ణ రాంబాబు, మోర్చా రాజారావు, తదితరులు పాల్గొన్నారు...