ప్లెక్సీ పై నిషేధం తగునా సి.ఎమ్? టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు.

ప్లెక్సీ పై నిషేధం తగునా సి.ఎమ్? టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

భీమిలి :విశాఖ లోకల్ న్యూస్:

      ప్లాస్టిక్ పై నిషేధం విధించి పర్యావరనాన్ని కాపాడవలసిన అవసరం ఉందని  కానీ.. ప్లెక్సీ పై నిషేధం సరైన నిర్ణయం కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు.

       రాష్ట్ర వ్యాప్తంగా  ఈ ప్లెక్సీ లపై ఆధారపడి 5 లక్షలకు పైగా జీవనం సాగిస్తున్నారని,  లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి  ప్రింటింగ్ మిషన్లు, ప్లెక్సీ షీట్స్ కొనుగోలు చేసి ఉన్నారని అన్నారు.  ఇంత సడన్ గా ప్లెక్సీ లపై నిషేధం అంటూ ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటన చేయవలసి వచ్చిందో అర్ధం కాలేదని గంటా నూకరాజు అన్నారు.  రీ సైక్లింగ్ కానీ ప్లాస్టిక్ వ్యర్ధాలు  పర్యావరనానికి  హానికరమని  అలాంటివి నిషేదించాలి కానీ ప్లెక్సీ లపై నిషేధం ఏంటని గంటా నూకరాజు ప్రశ్నించారు. ఎండలో బాగా ఆరితే పిండిలా అయిపోయి మట్టిలో కలసిపోయే  ప్లెక్సీ లను నిషేదించడం మంచిపద్దతి కాదని అన్నారు.  ప్లెక్సీ ప్రింటింగ్ మీద ఆధారపడి బ్యాంకు లో లక్షల రూపాయలు అప్పులుచేసి పెట్టుబడి పెట్టి జీవనం సాగిస్తున్న  వీరిపై ఎందుకు ఇంత కక్ష సాధింపని నిలదీశారు. ఇంత సడన్ గా నిర్ణయం తీసుకోవడం వలన ప్లెక్సీ లపై ఆధారపడిన వారు రోడ్డున పడతారని,  బ్యాంకు బకాయిలు కట్టలేక  అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదం ఉందని దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.  అయినా పర్యావరనానికి ముప్పుకాని  రిసీక్లింగ్ అయ్యే ప్లెక్సీ లపై నిషేధం ఎందుకని అడిగారు.  ప్లాస్టిక్ ని కనిపెట్టేవారికి నోబెల్ బహుమతి ఇచ్చారని,  కానీ అదే ప్లాస్టిక్ నేడు పర్యావరనానికి ముప్పు కావడంతో నిషేధం విదిస్తున్నామని,  ఇది యావత్ దేశమంతా హర్షించవలసిన విషయమని  అన్నారు.  ప్లాస్టిక్ ముసుగులో ప్లెక్సీ లపై నిషేధం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని గంటా నూకరాజు డిమాండ్ చేసారు.  ప్లెక్సీ లపై నిషేధం విధించిన  జగన్ రెడ్డి ప్రభుత్వం పరంగా అమ్ముతున్న మద్యం షాపులో మద్యం బాటిల్స్ ప్లాస్టిక్ లో ఉన్నాయని ముందు వాటిని నిషేదించాలని అన్నారు.