కార్పోరేటర్ పిసిని వరాహ నరసింహ ఆధ్వర్యంలో భాధుడే బాదుడు కార్యక్రమం


 సింహాచలం: విశాఖ లోకల్ న్యూస్

 కార్పోరేటర్  పిసిని వరాహ నరసింహ ఆధ్వర్యంలో భాధుడే బాదుడు కార్యక్రమం

భీమిలి నియోజకవర్గం 98 వ వార్డు సింహాచలం అడివివరం, గాంధీ నగర్ లో భాధుడే బాదుడు కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి భీమిలి ఇంచార్జ్ కోరాడ రాజు బాబు, జిల్లా ఉపాధ్యక్షులు పాశర్ల ప్రసాద్ , వార్డ్ కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహ పాల్గొన్నారు.. ముందుగా గాంధీ నగర్ లో గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులు, కరెంట్ చార్జీలు, వంట గ్యాస్, వంటి వాటిపై సామాన్యులపై భారంపడే విధంగా వ్యవహరిస్తుందని కోరాడ రాజబాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు,, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, త్వరలోనే వైసిపి నాయకులు తరిమికొట్టే రోజులు వస్తాయని, వచ్చే ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని గెలిపించాలని కోరారు, 98వ వార్డు కార్పొరేటర్ పి.వి. వరాహ నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేస్తుందని, దాని ద్వారా సామాన్యులకు అధిక భారం పడుతుందని, జీవీఎంసీ కౌన్సిల్లో పలుమార్లు చెత్త పన్ను ఎత్తివేయాలని మొరపెట్టుకున్న వైసిపి రాక్షస ప్రభుత్వలా వ్యవహరిస్తుందని అన్నారు, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కాలనీవాసులను కోరారు.. ఈ సందర్భంగా గాంధీనగర్ నుంచి అడివివరం జంక్షన్ వరకు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు... ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్, సిరపరపు సురేష్, రౌతు రాంబాబు, రాజు, అవినాష్, బంటుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.....