విశాఖ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన నగర మేయర్
విశాఖపట్నం:
విశాఖపట్నం, ఆగస్టు–6:- రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శనివారం ముఖ్యమంత్రికి విశాఖ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. శ్రీకాకుళంలో పెళ్లి వేడుకలకు విచ్చేసిన ముఖ్యమంత్రిని మధ్యాహ్నం 3.00 గంటలకు విశాఖ విమానాశ్రయంలో నగర మేయర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, పారిశ్రామిక శాఖామాత్యులు గుడివాడ అమర్నాథ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, నగర అధ్యక్షులు భీమిలి శాసన సభ్యులు అవంతి శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి లక్ష్మిశ ఘన స్వాగతం పలికారు.