ప్లాస్టిక్ నిషేధం పై ఇంటింటికి అవగాహన కల్పిస్తున్న చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు.

ఆజాదీ క అమృత్ మహోత్సవల్లో భాగంగా  ప్లాస్టిక్ నిషేధం పై ఇంటింటికి అవగాహన కల్పిస్తున్న  చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు.

కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్:


కేంద్ర ప్రభుత్వము తలపెట్టిన

ఆజాదీ క  మహోత్సవ్ లో భాగముగా కొమ్మాది లోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కొమ్మాది ప్రాంతములోని ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్

వాడకము నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ,  జంతు ఆరోగ్య సంరక్షణకు సహకరించాలని ,           ప్లా కార్డ్స్  చేతబట్టి  ప్లాస్టిక్ నిషేదమునకు ప్రజలు తమ సహకారం అందించాలని కోరారు. 


 ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విద్యార్థి గేదెల శ్రీహరి మాట్లాడుతూ భారత దేశము స్వచ్ఛత వైపు  ముందడుగు వేస్తుందని ప్రజలు , సామాజిక వేత్తలు,రాజనీతిజ్ఞులు సహకరించి ఈ మహాయజ్ఞమును విజయవంతం చేసి గాంధీజీ కలలు కన్నా ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు .ప్లాస్టిక్ వల్ల పర్యావరణ పరిరక్షణ దెబ్బ తింటుందని అన్నారు .

విద్యార్థి లాభాల దినేష్ కార్తీక్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను తిని అనేక పశువులు మరణిస్తున్నాయిని  అన్నారు. 

ఈ కార్యక్రమంలో కిరణ్ , శ్రావణ్ , నవ్య , శ్రావణి , మేఘన , ఐశ్వర్య , సోను , లావణ్య , మురళి అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ  ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పించారు