మదర్ తెరిసా ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలలి ఫ్రెండ్స్ వనిత వాకర్స్ క్లబ్
మధురవాడ విశాఖ లోకల్ న్యూస్
కులమతాలకు అతీతంగా సమాజసేవలో మదర్ తెరిసా ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఫ్రెండ్స్ వనిత వాకర్స్ క్లబ్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. నోబెల్ గ్రహీత మదర్ తెరిసా జయంతి సందర్భంగా శుక్రవారం మహా విశాఖ 6 వార్డు పరిధి పీఎం పాలెం లోగల లక్ష్మీవాణి పాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు సుమారు ఐదు వేల రూపాయలు విలువగల జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, కథల పుస్తకాలు, పెన్నులు, పెన్సిలు తదితర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పుష్పలత, ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, రాజేశ్వరి, సహాయ కార్యదర్శి జ్యోతి, సత్యవతి, ఇందిరరావు, ఉషాదొర, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.