భూసేకరణ ఆపాలని సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా
భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
భూసేకరణ ఆపాలని సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా కార్యక్రమాన్ని శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు, మండలంలోని నేరెళ్లవలస పంచాయతీ పరిధిలో ఉన్న. నేల వలస కొల్లిపేట గ్రామాలకు చెందిన సుమారు 40 మంది రైతుల సర్వే నెంబర్102లో యాభై రెండు ఎకరాలు చిన్న చిన్న కారు రైతులకు చెందిన భూమిని స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు. ఎటువంటి సమాచారం గ్రామ సభలు చేయకుండా భూమిని ఈ నెల 10వ తేదీన చదును చేశారు. దీనిని గమనించిన రైతులు అడ్డుకోగా ల్యాండ్ పోలింగ్ కింద భూమిని ఎంపిక చేసిందని దీంతో రైతులు ఆందోళన చెందారు. రోజు భీమిలిలో ఉన్న సిపిఎం నాయకులు ఆర్ ఎస్ ఎన్ మూర్తి.రవా నర్సింగరావు నాయకులు భీమిలి ఆర్డీవో కి రైతులతో ఫిర్యాదు చేశారు. శుక్రవారం సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో పద్మనాభం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారూ.