రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్య సూచన

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్య సూచన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమై ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంపై ఉందని, దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించడంతో మంగళవారం (ఈరోజు), బుధవారం (రేపు) ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయాగ, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

అనంతరం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

ఇక, ఏపీలోని విశాఖ, కర్నూలు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో వర్షాలు అధికంగా ఉంటాయని, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, విజయవాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు వివరాలను వెల్లడించారు.