పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన తొమ్మిది మంది పేద విద్యార్థులకు భీమిలి నీడీ వెల్ఫేర్ చేయూత.
భీమిలి:
భీమిలి నీడీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన తొమ్మిది మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికీ పది వేల రూపాయల చొప్పున మొత్తం తొంభై వేల రూపాయల సహాయాన్ని అందజేశారు. సోమవారం సాయంత్రం భీమిలి సన్ స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో భీమిలి నీడీ వెల్ఫేర్ సభ్యులు విద్యార్థినీ విద్యార్థులకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా భీమిలి నీడీ వెల్ఫేర్ ప్రతినిధులు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో భీమిలి ప్రజలకు ఆక్సిజన్ అందజేసే సదుద్దేశ్యంతో ప్రారంభమైన ఈ గ్రూప్ తరువాత పలురకాలైన సేవా కార్యక్రమాలతో ముందుకి వెళుతోందని అన్నారు. రక్త దాన శిబిరాలు నిర్వహించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా భీమిలి లోని వివిధ కొండ వాలు ప్రాంతాలలో సీడ్ బాల్స్ ను వెయ్యడం భారీ ఎత్తున చేపట్టామని చెప్పారు. అలాగే ఆగస్ట్ నెల 14 వ తారీఖున భీమిలి సన్ స్కూల్ ఆవరణలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన పేద విద్యార్థినీ విద్యార్థులను తొమ్మిది మందిని గుర్తించి వీరందరికీ ఈ ధన సహాయాన్ని అందజేయడం జరుగుతోందని వారు చెప్పారు. సహాయం పొందిన విద్యార్థినీ విద్యార్థులు చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలని భీమిలి నీడీ వెల్ఫేర్ సభ్యులు పిల్లలకు హితవు పలికారు. తమ పిల్లలకు సహాయం అందజేసిన భీమిలి నీడీ వెల్ఫేర్ ప్రతినిధులకు వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు భీమిలి నీడీ వెల్ఫేర్ సభ్యులు సూర్య శ్రీనివాస్ ముసునూరి, సన్నీ కాళ్ళ, వెంపాడ శ్రీనివాసరెడ్డి, కొత్తా రామకృష్ణ, అడిదం కిషోర్, వాండ్రాసి సతీష్, సీరపు ఉమా మహేశ్వరరావు, డాక్టర్ లావణ్య కాళ్ళ మరియు సన్ స్కూల్ హెచ్ ఎం అరుణ్ కుమార్ పాల్గొన్నారు.