లేగ దూడల ప్రదర్శన మరియు అవగాహన సదస్సు లో పాల్గొన్న డి.ఎల్.డి.ఎ చైర్మన్ గాడు వెంకట ప్పడు



 అనకాపల్లి ;విశాఖ లోకల్ న్యూస్

లేగ దూడల ప్రదర్శన మరియు అవగాహన సదస్సు లో పాల్గొన్న డి.ఎల్.డి.ఎ చైర్మన్  గాడు వెంకట ప్పడు 

అనకాపల్లి జిల్లా,కశింకోట మండలం లో   మండల పరిషత్ అధ్యక్షురాలు  కలగా లక్ష్మి గున్నయ నాయుడు  ఆద్వర్యంలో లేగ దూడల ప్రదర్శన మరియు అవగాహన సదస్సు స్థానిక కశింకోట మండల పరిషత్ ఆఫీస్ నందు నిర్వహించడం జరిగింది...
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన DLDA చైర్మన్  గాడు వెంకట ప్పడు   లేగ దూడలు పెంపకం వాటి ప్రత్యేక త గురించి  తన దైన శైలిలో రైతులకి తగిన సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం లేగ దూడల విషయంలో ప్రతిభ కనపరిచిన  ముగ్గురు రైతులకు  బహుమతిలు అందజేసారు.

అందులో భాగంగా ప్రదమ బహుమతి   పేరపు ఆనంద్ పుంగనూరు దూడకు, ద్వితియ బహుమతి గళ్ళ శివ కొండలరావు జెర్సీ దూడకు, తృతీయ బహుమతి పెంటకోట సన్యాసిరావు హెచ్ఎఫ్ దూడకు గాను గౌరవ DLDA  చైర్మన్ మరియు స్థానిక MPP   చేతుల మీదుగా అందజేయడం జరిగింది. భారతదేశానికి  స్వాతంత్ర్య వచ్చి 75 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా  దేశ ప్రాముఖ్యతను వివరిస్తూ  ఆజాదీ కాఅమృత్  మహోత్సవ్లో  భాగంగా రైతులందరకి జాతీయ జెండాలు పంపిణీ చేసారు.

 అలాగే ఇందులో పాల్గొన్న 33 మంది రైతులకు కసింకోట సర్పంచ్  జయ రజిని మరియు డిఎహెచ్ఓ డాక్టర్ బి ప్రసాదరావు  చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ రామ్మోహనరావు, వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి శ్రీనివాస్, అనకాపల్లి ఏడి డాక్టర్ బి సౌజన్య, కశింకోట వైద్యాదికారి ఆల్పానస జార్జ్,  డా.చైతన్య మని నర్సింగబిల్లి పశువైద్యాధికారి, స్థానిక ఈసీ మెంబర్స్ ఆళ్ల అప్పలనాయుడు, పెంటకోట వెంకట గణేష్ అప్పారావు, వుల్లురి గౌరీనాగరాజ్ కుమార్, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.