ప్రకృతి వనరులు మన నేస్తాలు


 విశాఖ లోకల్ న్యూస్:

ప్రకృతి వనరులు మన నేస్తాలు

 - ప్రకృతి వనరుల పరిరక్షణ మన స్నేహానికి చిహ్నం

 - ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు

 - శోభారాణి, ప్రిన్సిపాల్, విశాఖ ఉమెన్స్ డిగ్రీ కళాశాల 

ప్రకృతి వనరులు మన నేస్తాలు, వాటి పరిరక్షణ మన బాధ్యత అని విశాఖ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ,ప్రిన్సిపాల్, శోభారాణి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో గ్రీన్ క్లైమేట్ టీమ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమే మాట్లాడారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని ప్రకృతి వనరుల స్నేహితుల దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. మానవాళి మనుగడ సాగించాలంటే ప్రకృతి వనరులు అన్ని సంరక్షించబడాలి అని ఆయన పేర్కొన్నారు. సమస్త జీవ వైవిధ్య పరిరక్షణ మానవాళి బాధ్యత అని ఆయన వివరించారు. భూమ్మీద జీవరాశి తో మనకు సంబంధం ఉందన్నారు. ఏ జీవి అంతరించిన దాని ప్రభావం మానవాళి మీద పడుతుందన్నారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని దానిని వినియోగించవద్దని కోరారు. ఈ అంశం మీద ప్రతి ఒక్కరికి చైతన్యపరచాలి అన్నారు.విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తిరునగరి సాయి ప్రకాష్ మాట్లాడుతూ మనమంతా భూమితో సంబంధం కలిగినవారమని, అందుకే మనం ప్రకృతి వనరులను స్నేహితుల గా భావించి, వాటి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ప్రకృతి వనరులకు జరిగే నష్టం మానవాళి మనుగడకు పెను ముప్పు అని వివరించారు. ప్రతి విద్యార్థి ప్రకృతి వనరుల పట్ల ప్రేమతో జీవించాలని, వాటి పరిరక్షణకు కృషి చేయాలని కోరారు

గ్రీన్ క్లైమేట్ టీం,  వ్యవస్థాపక కార్యదర్శి, జె వి రత్నం మాట్లాడుతూ విశ్వంలో ఒక్క భూగోళం మీదే జీవరాశి ఉందని సమస్త జీవులు స్నేహితులుగా కలసి మెలసి జీవించాలని కోరారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని వారం రోజులు నిర్వహిస్తున్నమన్నారు. భూగోళం మీద ఏ జీవరాశి అంతరించిన దాని నష్టం మానవాళి మీద పడుతుందని పేర్కొన్నారు. మారిషస్లో డో డో పక్షి అంతరిస్తే సెల్ వేరియా చేట్ల పుట్టుక ఆగిపోయింది అన్నారు. దీనిని దృష్టిలో లోనికి తీసుకొని మనం అన్ని జీవరాశులతో స్నేహంగా జీవించాలని కోరారు.