ముఖ్యమంత్రి పిలుపు మేరకు స్వచ్చందంగా పాల్గొని నగర సముద్ర తీర ప్రాంతాన్ని క్లీన్ ప్లాస్టిక్ మార్చుటకు ప్రయత్నించిన 7వార్డ్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు
(మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్ )
స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విశాఖ నగర సముద్ర తీరం వెంబడి సుమారు 28 కిలో మీటర్ల మేర జీవియంసీ నిర్వహించిన కార్యక్రమంలో నగర పౌరులుగా ఏడవ వార్డు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు వార్డు అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు చొరవతో రామానాయుడు స్టూడియో దగ్గర ఉన్న సముద్ర తీరం ఒడ్డున ఉన్న ప్లాస్టిక్,ఇతర పర్యావరణ హానికర వ్యర్ధాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రకృతి మనకు ప్రసాదించిన పర్యావరణాన్ని,దాని సమతుల్యతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సామాన్య పౌరులుగా అందరి సామాజిక బాధ్యతగా భావించి ముఖ్యమంత్రి పిలుపు మేరకు స్వచ్చందంగా పాల్గొని నగర సముద్ర తీర ప్రాంతాన్ని క్లీన్ ప్లాస్టిక్ గా మార్చుటకు ప్రయత్నించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిల్లా కృష్ణ మూర్తి పాత్రుడు,పిల్లా సూరిబాబు,అల్లాడ లింగేశ్వరరావు, చేకూరి రజిని,నూకవరపు బాబ్జి,తమ్మినేని వరలక్ష్మి,బెల్లాపు పాపారావు, అప్పన్న, బంగారు ప్రకాష్, పసుపులేటి గోపి,బచ్చల మురళీ,యల్లాజీ,గోవింద్,ఆషా స్వరూప్,ఆశా జ్యోతి,శ్రీదేవి,రాజు తదితరులు పాల్గొన్నారు.