కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేతుల మీదగా 62 మంది లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందజేత


 కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేతుల మీదగా 62 మంది లబ్ధిదారులకు  కొత్త పెన్షన్లు అందజేత

విశాఖ లోకల్ న్యూస్  ఆగస్టు 1,

జీవీఎంసీ 22వ వార్డులో సోమవారం  నిర్వహించిన  వైస్సార్ పింఛన్ కానుక పథకం లో కొత్తగా మంజూరైన 62 మంది లబ్ధిదారులకు  వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫించన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో అర్హులైన వారందరికీ ఫించన్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు.  మానసిక వికలాంగ, వృద్ధ, వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా 62 పింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు.    ఈ కార్యక్రమంలో వార్డు కమ్యూనిటీ  సచివాలయ వెల్ఫేర్ కార్యదర్సులు, అడ్మిన్ కార్యదర్సులు, వలంటీర్లు పాల్గొన్నారు.