5 వ వార్డ్ ఎన్టీఆర్ హుదూద్ కాలనీ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కరించిన కార్పొరేటర్ మొల్లి హేమలత

5 వ వార్డ్ ఎన్టీఆర్ హుదూద్ కాలనీ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కరించిన కార్పొరేటర్ మొల్లి హేమలత 

మధురవాడ:

మధురవాడ: జీవీఎంసీ ఐదోవ వార్డ్ లో గల ఎన్టీఆర్ హుదూద్ కాలనీ లో త్రాగునీటి బోర్ పూర్తిగా పాడవటం వలన ప్రజలు చాలా కాలం నుండి త్రాగునీటి కి ఇబ్బంది పడుతున్నారన్న విషయం కార్పొరేటర్ మొల్లి హేమలత దృష్టికి రాగ వెంటనే స్పందించిన కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం లేవనెత్తారు. తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని మేయర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయగా ఆ కాలనీ లో కార్పొరేటర్ మొల్లి హేమలత సమక్షం లో క్రొత్త బోర్ వేయడం జరిగింది. కాలనీ సమస్య పై వెంటనే స్పందించి పరిష్కరించిన కార్పొరేటర్ మొల్లి హేమలత ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమం లో వాటర్ సప్లయ్ DE శ్రీహరి, M M నాయుడు, సతీష్ కాలనీ పెద్దలు ప్రసాద్, జోగేశ్వర పాత్రో, కొత్తల శ్రీను తదితరులు పాల్గొన్నారు.