5,7 వార్డుల లో సచివాలయాలలో వసతుల కొరత.
మధురవాడ ;
వార్ఢు సచివాలయాల లో వసతులు, బైయో మెట్రిక్ డివైస్ ల తో పాటు శిబ్బంది కొరత కనిపిస్తుంది. ముఖ్యంగా జీవీయంసి 5,7 వార్డుల పరిస్థితి మరీఘోరం.ప్రధానంగా స్లమ్ ఏరియా లు ఎక్కువగా ఉన్నవార్డులు 5 మరియు 7,పథకాల పంపిణీకి ఆవసరమైన బయోమెట్రిక్ డివైస్ ల కొరత అధికం గా వుంది.దీనివలన వాలంటీర్ల పించన్ల పంపిణీ ఆడివైస్ ల సర్దు బాటు పై ఆధారపడ వలసిన పరిస్థితి, వాలంటీర్ల కొరత ఆ విభాగం పై పని భారిన్ని పెంచు తుంది.కార్యదర్శుల కొరతతో పరస్థితి మరీ దారుణం.కొన్ని సచివాలయాలకు వాటిని సజావుగా నిర్వహించవలసిన ఎడ్మిన్స్ లేరు.ఇంచార్జులతో నెట్టుకొస్తు న్నారు.బీమిలి నియోజకవర్గం , మదురవాడజోన్ పరిధి 5నుండి8వ వార్డులుపరిశీలిస్తేటీడిపీ కార్పొరేటర్ల వార్డు సచివాలయాలపై వివక్ష వుందా అన్న అనుమానం పొడ సూపుతుంది.ఈ పరిధిలోగల నాలుగు వార్డుల్లో 5,7 వార్డులు ప్రతిపక్ష టీడిపీ కార్పొరేటర్లు వుండగా,6,8వార్డుల్లో అధికార వైసీపీ కైవసం చేసుకుంది.ప్రతిపక్ష 5వ వార్డులో15 సచివాల యాలు వుండగా వాటిల్లో 9 సచివాలయాలు,7వ వార్డు 13 సచివాలయాలలో 9 సచివాలయాలకు ఇంచార్జ్ ఎడ్మిన్స్ మాత్రమే వున్నారు.ఇక అధికార పార్టీ కార్పొరేటర్లు వున్న 6వ వార్డులో గల 12 సచివాలయాలలో రెండింటికి,8వ వార్డులోగల12 సచివాలయాలకుగాను నాలుగింటికి మాత్రమే ఇన్చార్జులు వున్నారు. కొన్ని అద్దే భవానాలలోని సచివా లయాలకు గూర్తింపుకు బేనర్లు కట్టగా అవి చిరిగి ఆ కార్యాలయాల దుస్థిని చాటుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థ కు నాంది పలికి ప్రేత్యేకమైన కొత్త ఉద్యోగాలు కల్పించి వారికి గత నెలలో ప్రొభేషన్ పరిధిలోకి తీసుకొని ఆగష్టు నెల నుండి కొత్త జీతాలు కూడా చెల్లిస్తున్నారు.అసలు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో ఉన్నప్పుడు టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన వార్డులలో ఉన్న సచివాలయాల పై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తుంది అంటున్న 5,7వార్డుల లో ఉన్న ప్రజలు ఇప్పటి కైనా సంబందిత ఆధికారులు ఈ పరిస్థితులను చక్కదిద్ది వైసీపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా,జగన్ మానస పుత్రికలుగా నెలకొల్పిన సచివాలయ వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న 5,7వార్డుల లో ఉన్న ప్రజలు .