ఉత్తర నియోజకవర్గం 55వ వార్డులో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ.
విశాఖ లోకల్ న్యూస్:ఉత్తర నియోజకవర్గ ప్రతినిధి
మాజీ మంత్రివర్యు లు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు మంగళవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు కంచరపాలెం లో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడు విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్టీ కార్యదర్శి జాన్, జిల్లా పార్టీ కార్యదర్శి సౌజన్య, 55వ వార్డు ప్రెసిడెంట్ వీరుబాబు, వాసుపల్లి రాజు లక్ష్మణ్, గొంప ధర్మారావు, ఏడుకొండలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.