5 వ వార్డ్ శారదనగర్ లో కార్పొరేటర్ మొల్లి హేమలత పర్యటన :త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తానని హామీ

5 వ వార్డ్ శారదనగర్ లో కార్పొరేటర్ మొల్లి హేమలత పర్యటన :త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తానని హామీ 

మధురవాడ :

మధురవాడ : జీవీఎంసీ ఐదో వార్డ్ శారదనగర్ కాలనీలో వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత పర్యటించారు.ఈ పర్యటనలు భాగంగా అక్కడ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రధానంగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని సదరు ఆ సమస్య పరిష్కారాని కై తాను జివిఎంసి కౌన్సిల్ సమావేశంలో చాలా సార్లు లేవనెత్తనని మరియు ఈ మధ్య కాలం లో మేయర్ కి కమిషనర్ కి వ్రాతపూర్వకంగా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందని సమస్య పరిష్కారానికి మేయర్ మరియు కమిషనర్  సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. కావున తొందరలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. 

కాలనీలో రోడ్లు,కాలువలు మరమ్మతులు మరియు మెట్ల మార్గాలు  వేయవల్సిన అవసరం ఉందని కావున సంభందిత అధికార్లకు వెంటనే మరమ్మతులు చేయమని ఆదేశాలు జారీ చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు ఆనందరావు , సుంకర అప్పలనాయుడు, వంశి, కనకరాజు, కొండ్రు రమణ కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.