మట్టి ప్రతిమలనే పూజించండి పర్యావరణాన్ని, సముద్ర జీవ రాసులను కాపాడండి :జోన్ 2కమీషనర్ బొడ్డేపల్లి రాము.

మట్టి ప్రతిమలనే పూజించండి పర్యావరణాన్ని, సముద్ర జీవ రాసులను కాపాడండి :జోన్ 2కమీషనర్ బొడ్డేపల్లి రాము.

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్:

జోన్ 2 మధురవాడ సోమవారం ద్రోణంరాజు కల్యాణమండపం లో పారిశుధ్య సిబ్బందికి విశాఖ లోకల్ టీవీ ఛానల్, వెబ్ఛానల్, యాప్ వార్త ఛానల్ నిర్వహిస్తున్న గొంతిన హరికృష్ణ ఆధ్వర్యంలో ప్లాస్టో పారిస్ ను విడనాడండి పర్యావరణాన్ని కాపాడండి,అంటూ ఆక్సిజెన్ విడుదల చేస్తూ దైవంగా ప్రతీ హిందూ పూజిస్తున్న తులసి మొక్కను, వినాయక మట్టిప్రతిమను జీవీఎంసీ 7వ వార్డు పారిశుధ్య సిబ్బందికి జీవీఎంసీ పంపిణీ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ 2 కమీషనర్ బొడ్డేపల్లి రాము చేతులమీదుగా అందచేశారు. 

ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి రాము మాట్లాడుతూ రంగులు వేసిన విగ్రహాలను పూజించి నిమజ్జనం చెయ్యటం వల్ల సముద్ర జీవ రాసులు మరణిస్తాయని మట్టి ప్రతిమలను పూజించటం వల్ల పూజ పూర్తయ్యినతరువాత ప్రతిమను ఇంటివద్దే ఒక తొట్టేలో నీరు పోసి మట్టి కరిగేవరకు ఉంచి ఆనీటిని చెట్టు మొదల్లో వెయ్యాలని, ప్రతిమను చేసే మట్టి మనుషులు నడవని స్థలం పుట్ట మట్టినుండి సేకరించి ప్రతిమలను తయారు చేస్తారని తెలుపుతూ, తులసి మొక్క రాత్రి మానవులు నిద్రనుండి మేల్కొని విడుదల చేసిన కార్బన్ డైయాక్సైడ్ ను తీసుకుని మనుషులకు అవసరమైన ఆక్సిజెన్ విడుదల చేస్తుందని మరియు తులసిని ప్రతీ ఒక్క హిందూ దైవం గా పూజిస్తారని పర్యావరణాన్ని కాపాడేవారిమి అవుతామణి రానున్న తరానికి సందేశాన్ని ఇవ్వాలని సచివాలయ పారిశుధ్య సిబ్బంది జీవీఎంసీ సిబ్బందికి తెలియచేస్తూ వినాయక ప్రతిమ తులసి మొక్క ను సిబ్బందికి అందచేశారు. అనంతరం సచివాలయం పారిశుధ్య విభాగం వారికి జీవీఎంసీ కమీషనర్ లక్ష్మి షా ఆదేశించిన ప్రకారం మట్టి ప్రతిమలు పూజించిన వారి నుండి ప్రతిమలు సేకరించి వారిని అభినందనలు తెలపాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో 7వ వార్డు పారిశుధ్య ఇన్స్పెక్టర్ అప్పారావు,విశాఖ లోకల్ టీవీ చానల్ సభ్యులు  సంతోషి, పద్మ, భవాని, చంద్రశేఖర్, సచివాలయం పారిశుధ్య విభాగం సిబ్బంది, జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.