*పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు...ఆరెంజ్ అలర్ట్ జారీ*
న్యూఢిల్లీ:
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ద్రోణి కారణంగా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. మూడు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడులో జులై 27వతేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.సోమవారం ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.జారీదేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మేఘావృతమైన ఆకాశం కనిపిస్తుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో వెల్లడించింది. వర్షపాతం మూడవ రోజు నుంచి క్రమంగా తగ్గుతుందని అంచనా వేసింది.ఐఎండీ భారీ వర్ష సూచన గత 24 గంటల్లో పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కొంకణ్, హిమాచల్ ప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.పశ్చిమ రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని వివిక్త ప్రదేశాలు, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, పంజాబ్‌లోని దక్షిణ అంతర్గత ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిశాయి.
జారీమెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
రుతుపవనాల మార్పు కారణంగా 24 నుంచి 26వ తేదీ వరకు గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో, ఉత్తర కొంకణ్, మధ్య మహారాష్ట్ర, తూర్పు మధ్య ఘాట్ ప్రాంతాలను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, తేని, దిండిగల్, ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి, తిరుప్పత్తూరు, సేలం, కళ్లకురిచ్చి, కరూర్, నామక్కల్, తిరుచిరాపల్లి, పెరంబలూరు, మధురై తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూ, కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
హిమాలయ ప్రాంత జిల్లాల్లో...
హిమాలయ ప్రాంత జిల్లాలైన డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పాయిగురి, కూచ్ బెహార్, అలీపుర్‌దువార్‌లలో సోమవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సికార్, చిత్తోర్‌గఢ్, జైపూర్, భరత్‌పూర్, కరౌలి, జోధ్‌పూర్, నాగౌర్, చురు, జైసల్మేర్‌తో సహా రాజస్థాన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రానున్న మూడు-నాలుగు రోజుల పాటు రాజస్థాన్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..