మొగదారమ్మ కాలనీ లో నివసిస్తున్న మేము మనుషులమే మాకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించండి
మధురవాడ:మొగదారమ్మ కాలనీ:మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటూ అధికారుల్ని వేడుకుంటున్న మొగదారమ్మ కాలనీ వాసులు
భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ జోన్ 2 పరిధిలోని ఏడో వార్డు మొగదారమ్మ కాలనీలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతంలో నీరు, డ్రైనేజీ, కాలువలు, విద్యుత్ పలు కనీస సదుపాయాలు లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా డ్రైనేజీ మురుగు నీరు ట్యాంక్ లకు అవుట్ లైన్ లు ఇవ్వనందు వల్ల ఒక మాసంలో ట్యాంక్ నిండి పోయి మురుగు నీరు బయటకి వచ్చి అక్కడే నిలిచి పోతుందని ఆమురుగు నీరు లో పందులు దొర్లి గుంతలు పెట్టేస్తుండటంతో మా పిల్లలు ఆ గుంతలలో పడిపోతున్నారని దుర్వాసన వల్ల ఇంటిలో ఉండటంవల్ల అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడే ఖాళీ స్థలం లో మొక్కల వ్యర్ధాల కుప్పలు దీని పై 7వ వార్డు శానిటరీ ఇనస్పెక్టర్ అప్పారావు దృష్టికి వారం క్రితం తీసుకు వెళ్ళగా బేబీ కార్టుతో వ్యర్థాలు తొలగిస్తామని,నిలిచిన మురుగు ప్రాంతాలలో క్రిమి సంహారక రశాయనాలు పిచకారీ చేయిస్తామని తెలిపారు.కాని రోజులు గడిచినా నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోక పోవటం వలన తాము రోగాల బారిన పడతామని పరిసర ప్రాంతవాసులు భయపడుతున్నారు.
మంచినీరు సమస్య ఏళ్ళు గడుస్తున్నా పరిష్కారానికి నోచుకోవటం లేదని ట్యాంకర్ తో నీరు ఏ సమయంలో వస్తుందో తెలియదని వచ్చినా ఒక్కో రోజు సగం ట్యాంకర్ వస్తుందని వచ్చిన నీరు ఒక్కో ఇంటికి డ్రమ్ లలో నిల్వచేసుకొని రెండు ఫ్లోర్ల పైకి మోసుకోవలసి వస్తుందని మా యొక్క సమస్యను గుర్తించి సమీపంలో ఉన్న ట్యాంక్ కి లైన్ వేస్తే కాలనీ ప్రజల నీటి కష్టం తొలగిపోతుందని నాయకులను, అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు.
ఈ ప్రాంతంలో విధ్యుత్ సమస్య ఉండటంతో చుట్టూ తుప్పలు, మొక్కలు ఎక్కువగా పెరిగిపోవటంతో మురుగునీరు నిల్వ ఉండటంతో పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయని ఏ సమయంలో ఎవరింటిలోకి వచ్చి ఎవరికీ ప్రమాదం సంభవిస్తుందో అని భయంతోనే బ్రతుకుతున్నామని వాపోయారు.
ఈ ప్రాంత ఆరోగ్య పరిరక్షణకు, మంచినీటి, విధ్యుత్, మౌలిక సదుపాయాలకు తమరు సత్వర చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ ఉన్నత అధికారులకు, రాజకీయనాయకులకు స్థానికుల తరపున వినయ పూర్వకంగా అభ్యర్థిస్తున్నాము.