ట్రినిడాడ్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది

ట్రినిడాడ్‌  తొలి మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది

ట్రినిడాడ్‌:

ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. 68 పరుగుల తేడాతో విండీస్‌ జట్టును సమష్టిగా మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(64), దినేశ్‌ కార్తిక్‌(41 నాటౌట్‌) చెలరేగారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ జట్టు 20 ఓవర్లలో 122 పరుగులే చేసింది. భారత జట్టులో అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ తలో రెండు వికెట్లు తీశారు.