తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ బోర్డు శనివారం వెల్లడించింది.
తిరుమల:
తిరుమల: ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ బోర్డు శనివారం వెల్లడించింది. ఆగస్టు నెల విశేష పర్వదినాల జాబితా ప్రకారం ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఆగస్టు 19 న గోకులాష్టమి, ఆగస్టు 31న వినాయక చవితి పండుగలను జరుపనున్నారు.ఆగస్టు 1న శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు చేస్తారు.ఆగస్టు 2న గరుడపంచమి, శ్రీవారి గరుడోత్సవంఆగస్టు 6న శ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి
ఆగస్టు 9న నారాయణగిరిలో ఛత్రస్థాపనం
ఆగస్టు 8 నుండి 10వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు
ఆగస్టు 11న శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ, శ్రీ విఖనస మహాముని జయంతి
ఆగస్టు 12న శ్రీ హయగ్రీవ జయంతి, శ్రీవారు విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 19న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం
ఆగస్టు 20న శ్రీవారి ఆలయం వద్ద ఉట్లోత్సవం
ఆగస్టు 29న బలరామ జయంతి
ఆగస్టు 30న వరాహ జయంతి
ఆగస్టు 31న వినాయక చవితి