ఉజ్వల భారత్ - ఉజ్వల భవిష్యత్తు" కార్యక్రమం లో పాల్గొన్న అవంతి.
ఆనందపురం:
ఆజాద్ కా అమృత్ మహాత్సవం లో బాగంగా ఆనందపురం మండల పరిషత్ కార్యాలయంలో లక్ష్మివారం నాడు ఏర్పాటు చేసిన "ఉజ్వల భారత్ - ఉజ్వల భవిష్యత్తు" విద్యుత్ 2047 కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది*కార్యక్రమంలో బాగంగా అవంతి జ్యోతి ప్రజ్వలన చేసారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిపి చేస్తున్న "మన భారత్ మన భవిష్యత్తు" విద్యుత్ 2047 కార్యక్రమం లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని విద్యుత్ మనకు ఎంత ఉపయోగమో అంతే ప్రమాదకరం అలాంటి విద్యుత్ శాఖ లో ఉద్యోగులు నిరంతరం 24 గంటలు పని చేస్తూ ఉంటారు కరోనా సమయంలో లో పకృతి విపత్తులు సంభవించే సమయంలో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా అందించాలనే పని బాధ్యత తో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు వారి సేవలు ఎనలేనివి వారికి నా ధన్యవాదాలు అలాగే రైతులకు ఏదైతే 9 గం ఉచిత విద్యుత్ సరఫరా ఉందో భారతదేశం మొత్తం మీద దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కే దక్కిందని ఆయన రైతులకు చేసిన ఈ ఉపాది వలన ఆరోజు నుండి ఆయన తరువాత ఆయన కుమారుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రైతే రాజు ఇది రైతుల ప్రభుత్వం అని రైతులకు విద్యుత్ సరఫరా తో పాటు పలు సంస్కరణలు చేయడం వలన ఈరోజు వరుకూ గతంలో ఉండే రైతులు ఆత్మహత్య లు లేకుండా చేసారని ఇది వైయస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అని వ్యవసాయం దండగ అనే దానిని ఉచిత విద్యుత్ ద్వారా నాడు రాజన్న నేడు జగనన్న వ్వవసాయం పండుగ లా చేసుకునేలా రైతులు జీవితాల్లో వెలుగులు నింపారని మరో 30 ఏళ్ళు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం చాలా హర్షించ దగ్గ విషయం అని మాట్లాడారు* ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చైర్మన్ శుభద్ర జిల్లా ప్రభుత్వ విద్యత్ శాఖ అధికారులు, నియోజకవర్గ కార్పోరేటర్ లు, వార్డు ఇంచార్జ్ లు, వార్డు ప్రెసిడెంట్ లు,మూడు మండలాల యంపిపి లు జెడ్పిటీసి లు వైస్ యంపిపి లు సర్పంచ్ లు యంపిటిసి లు ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు ,నాయకులు కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు*