వాంబే కోలనీ లో డా.వైయస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం లో పాల్గొన్న : భీమిలి శాసనసభ సభ్యులు అవంతి శ్రీనివాసరావు మరియు ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని

మధురవాడ :విశాఖ లోకల్ న్యూస్

వాంబే కోలనీ లో  డా.వైయస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం లో పాల్గొన్న : భీమిలి శాసనసభ సభ్యులు అవంతి శ్రీనివాసరావు మరియు   ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని

జీవియంసి జోన్ టు  7 వ వార్డు వాంబేకొలని  లో  భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు  కోటి రూపాయిలు తో  పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమం కి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ ఇంచార్జ్ మంత్రి  ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశించి  అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం లో ప్రైమరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలాగే అర్బన్ లో ప్రతీ వార్డు కి ఒక అర్బన్ ప్రైమరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  7 ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేయడం జరిగింది అని  ప్రతీ పేదవాడికి విద్య తో పాటు వైద్యం కూడా అందుబాటులో ఉండాలని ఈ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకం పెట్టి ప్రతీ పేదవాడి గుండేల్లో నిలిస్తే ఆయన కుమారుడు జగనన్న వైద్య విధానంలో పలు సంస్కరణలు చేసి ప్రతీ పేదవాడికి సేవలు నిరంతరం అందేలా చేస్తున్నారని తండ్రి ఆశయాలు నేరవేర్ఛే నాయకుడు ఆయనే అని మాట్లాడారు . ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి కుమారి  ప్రభుత్వ ఆరోగ్య శాఖ అదికారులు, వార్డు కార్పోరేటర్ లు, వార్డు ప్రెసిడెంట్ లు, వార్డు ఇంచార్జ్ లు ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.