ఎమ్మెల్యే గణబాబు అధ్యక్షతన బూత్ స్థాయి బూత్ కన్వీనర్ లతో సమావేశం.

ఎమ్మెల్యే గణబాబు అధ్యక్షతన బూత్ స్థాయి బూత్ కన్వీనర్ లతో సమావేశం.

నాయుడు తోట:


నాయుడు తోట లక్ష్మీ కళ్యాణ మండపం లో ఎమ్మెల్యే గణబాబు అధ్యక్షతన విశాఖ పశ్చిమ నియోజవర్గ క్లస్టర్ ఇన్చార్జులు యూనిట్ ఇన్చార్జిలు మరియు బూత్ స్థాయి బూత్ కన్వీనర్ లతో సమావేశం జరిగినది. ఈ సమావేశానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫునుంచి పరిశీలకులుగా ద్వారపూడి జగదీష్ (ఎమ్మెల్సీ) మరియు ముఖ్యఅతిథిగా విశాఖ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు  పల్లా శ్రీనివాసరావు (Ex.MLA) , కిమిడి మాలిక్  విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ గా మరియు  కార్పొరేటర్స్ సరగడం రాజశేఖర్ , బొమ్మిడి రమణ, గల్లాచిన్న , దాడి వెంకట రమేష్ , మరియు మూర్తి యాదవ్, వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ లు పాల్గొన్నారు.సమావేశంలో క్లస్టర్ లను, బూత్ కన్వీనర్ లను ఉద్దేశిస్తూ గణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత ధరలు పెరగడం పై బాదుడే బాదుడు కార్యక్రమం  మరియు టి డి పి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు అలాగే ప్రజా సమస్యలపై తమ తమ వార్డుల్లో పరిష్కార దిశగా పని చేయాలని తెలియజేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇంతవరకూ చురుగ్గా పని చేసిన వార్డు నాయకులను, సభ్యులను కొనియాడి వారిని  సత్కరించారు.