ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీగా నిమ్మకాయల భాస్కర్ కి బాధ్యతలు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఢిల్లీ నుండి ఆర్ మని నాయుడు బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని అధ్యక్ష పదవులు మరియు జాయింట్ సెక్రెటరీ పదవులను నియమించడం జరిగింది దానిలో భీమునిపట్నం నియోజకవర్గం కన్వీనర్ గా నిర్వహిస్తున్న నిమ్మకాయల భాస్కర్ పార్టీకి చేస్తున్న సేవలు కార్యక్రమాలు పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కరిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ గుర్తించి ఈ యొక్క సేవలు రాష్ట్రానికి ఉపయోగపడతాయని ఇలాంటి నాయకులు రాష్ట్రస్థాయిలో తమ సేవలను అందించాలని ఆప్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది, నిమ్మకాయల భాస్కర్ మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గం కన్వీనర్ గా నా బాధ్యతలు నిర్వహిస్తున్న నన్ను రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా నియమించడం చాలా సంతోషకరమైన విషయం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల్లో స్పష్టత లేని పరిపాలన అందిస్తున్నారని ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారని ప్రజలపై అనేక వంటి భారాలు మోపడం సంక్షేమం పేరుతో రాష్ట్రం అప్పుల పాలు అవడం వీటన్నిటికీ సమాధానం అవినీతి రహిత ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రావడమే అని అప్పుడే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ ఆమ్ ఆద్మీ పార్టీ అవుతుందని 2024లో ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని అవినీతి రహిత పాలన అందించడంలో తన వంతు కృషి చేస్తానని ఢిల్లీ మోడల్ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొని రావాలి అని ప్రజలకు మెరుగైన ఉన్నతమైన విద్య, వైద్యం అందించాలని నిరుద్యోగం అంతం చేయాలని మా ముఖ్య అజెండా అని తెలిపారు, నాకు ఈ ఒక్క అవకాశాన్ని కల్పించిన ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాలు ఇన్చార్జి మని నాయుడు , రాష్ట్ర కమిటీ,జిల్లా కమిటీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.