సచివాలయం లో గేదలు ...గుంటూరు లో వింత పంచాయతీ!
గుంటూరు:
గుంటూరు: 'స్పందన' కార్యక్రమంలో ఓ అర్జీదారుడి దెబ్బకు శానిటరీ సూపర్వైజర్.. రైతు గేదెలను తీసుకొచ్చి సచివాలయం వద్ద కట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని ఏటుకూరు ప్రాంతానికి చెందిన ఓ అర్జీదారు.. తన ఇంటి పక్కన ఉన్న గేదెలతో వాసన వచ్చి ఇబ్బంది పడుతున్నానంటూ ఏడాది కాలంగా తరచూ అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో శానిటరీ సిబ్బంది పలుమార్లు గేదెల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినా స్పందనలేదు. దీనిపై వారు న్యాయస్థానం వరకు వెళ్లారు. అయితే, తరచూ ఇదే సమస్యపై స్పందనలో ఫిర్యాదు రావటంతో చేసేదేమీ లేక శానిటరీ సూపర్ వైజర్ వెంకటేశ్వరరావు.. రైతు శ్రీనివాస్కు చెందిన గేదెలను తీసుకొచ్చి సమీపంలోని సచివాలయం వద్ద కట్టేశారు. గేదెలను తీసుకొచ్చిన అధికారులు దూడను తీసుకురాకపోవడంతో
అది రంకెలేస్తోంది. స్పందన అర్జీ పరిష్కరించకుంటే తనను సస్పెండ్ చేస్తారని, అందుకే ఇలా గేదెలను తీసుకొచ్చి సచివాలయం వద్ద కట్టేశామని శానిటరీ సూపర్ వైజర్ చెబుతున్నారు. వాటి పాలను
తీసుకోవాలని సదరు రైతుకు సూచించామన్నారు.!