ఐదో వార్డ్ కొండవాలు ప్రాంతాలకు త్రాగునీరు అందించాలి :స్పందనలో జీవీఎంసీ మేయర్ కి కార్పొరేటర్ మొల్లి హేమలత వినతి.
మధురవాడ:
మధురవాడ: జీవీఎంసీ ఐదవ వార్డ్ లో గల కొండవాలు ప్రాంతాలైన శారధానగర్, అయ్యప్ప నగర్, వివేకానంద కాలనీ, సాయిరాం కాలనీ లలో ప్రజలు త్రాగనీరు తెచ్చుకోవాలOటే కొండ దిగువ భాగానికి వచ్చి మళ్లీ నీళ్లు పట్టుకొని కొండపైకి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో మేయర్ కమిషనర్ ఐదవ వార్డులో పర్యటించినప్పుడు ఇక్కడ ప్రజలు తమ సమస్యలను మేయర్ కి కమిషనర్కి తెలియపర్చిన విషయం గుర్తు చేశారు. అప్పుడు కమిషనర్ లక్ష్మి షా అధికారులకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయినను నెలలు గడుస్తున్న ఇక్కడ సమస్య పరిష్కారానికై ఏ చర్య చేపట్టలేదు. ముఖ్యంగా అయ్యప్ప నగర్ త్రాగునీటి ప్రాజెక్టులో భాగంగా వివేకానంద కాలనీ ,గాంధీ నగర్ కాలనీలలో ఇంతవరకు పైప్ లైన్ వేయలేదని తెలియపరిచారు. అలాగే శారదనగర్ కాలనీలో ఎప్పుడో వేసిన పైప్ లైన్ పాడవటం వలన కొండ పై భాగానికి నీరు చేరుకోవడం లేదు. కావున ఆ పాత పైప్ లైన్ ను మార్చి కొత్త పైపు లైన్ వేయమని చాలాసార్లు కౌన్సిల్ సమావేశంలో తెలియజేయడం జరిగిందని చెప్పారు. కావున ఇప్పటికైనా ఐదవ వార్డులో త్రాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి త్రాగునీటి సమస్య పరిష్కరించాలని ఐదవ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత స్పందన కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కి వినతి పత్రం ఇచ్చి తెలియజేశారు. వెంటనే స్పందించిన జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి సమస్య పరిష్కారానికై చర్యలు చేపట్టమని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు.