మధురవాడ పి హెచ్ ఆర్ సి లో ఉచిత లయన్ కేన్సర్ స్క్రీనింగ్ శిబిరం .
మధురవాడ పి హెచ్ ఆర్ సి:
భీమిలి జీవీఎంసీ జోన్ టు మధురవాడ లో పి హెచ్ ఆర్ సి లో ఉచిత లయన్ కేన్సర్ స్క్రీనింగ్ శిబిరం లయన్స్ క్లబ్ మధురవాడ అధ్యక్షుడు పోతిన.ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంతి మెడికల్ ఆఫీసర్ మరియు డా.ఉమా మహశ్వరరావు మాట్లాడుతూ
ప్రపంచంలో కేన్సర్ వ్వాధీ బాగా ప్రబులుతున్న ఈ సమయంలో ముందు గా గుర్తించి వైద్యం చేయిస్తే చాలా కేన్సర్ వ్యాధులు నయమవుతాయి. జీవనకాలం | బాగా పెరుగుతుంది. చాలా రకాల కేన్సర్ వ్యాధులు పూర్తిగా బాగవుతాయి. ఎక్కువ కేన్సర్ వ్యాధులు పొగాకు, సిగరెట్లు, చుట్ట, అడ్డపొగ, నశ్యం, బీడీలు, గుట్టాలు, ఖైని సారాయి వలన వస్తాయి. ప్రారంభదిశలో గుర్తించి వైద్యం చేయించుకున్నవారు కొన్ని దశాబ్దాలు జీవించవచ్చును.
కేన్సర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు: మానని పుండు తగ్గని దగ్గు, బొంగురు గొంతు రొమ్ములలో కానీ, శరీరంలో మరెక్కడైనాకానీ పెరుగుతున్న కాయలు- కణితులు * పెరుగుతున్న పుట్టుమచ్చ, పులిపిరి కాయలు అసహజమైన రక్తస్రావం, ముఖ్యంగా స్త్రీలలో బహిష్టు ఆగిన తరువాత ఎర్రబట్ట, తెల్లబట్ట * దీర్ఘకాల అజీర్తి, మ్రింగుట కష్టం మలవిసర్జనలో మార్పులు-ఎక్కువ మలబద్ధకం పై లక్షణాలు కలవారు ఈ శిబిరంలో ఉచిత తనిఖీలు చేపట్టారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతిన ప్రసాద్ లయన్స్ క్లబ్ ప్రసిడెంట్ డాక్టర్ ప్రశాంతి మెడికల్ ఆఫీసర్ మధురవాడ డా.ఉమా మహశ్వరరావు లయన్స్ కేన్సర్ హాస్పిటల్ ట్రస్టీ, డా.ఉషరజు చైర్మన్ ,డా.నవ్య ,డా.కళ్యాణ్ ప్రసాద్ ,డా .సురేంద్ర ,బ్రహ్మం పాల్గొన్నారూ. ఈ శిబిరలో సుమారు 200 ప్రజలు కు పరీక్షలు చేయించుకున్నారు అని తెలిపారు.