పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కల నాటాలి :కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పిలుపు:

పర్యావరణ  పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కల నాటాలి :కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పిలుపు 

ఆనందపురం:

పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ విస్తృతంగా మొక్కలు నాటాలని తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుందని టిడిపి యువ నాయకుడు, వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వనరులను పరిరక్షించుకుంటూ తదుపరి తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని వనరులను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమతుల్యాన్ని పాటించాలంటే మొక్కలను సంరక్షించడం దైనందిక  కార్యక్రమం గా భావించి అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తో పాటు నడిమింటి అప్పలరాజు, కోరాడ రమణ, బోధ నారాయణప్పడు, భోజ రాజు, ముడసల శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.