భూములు కోల్పోయిన రైతులకు వెంటనే ఇల్లు అప్ప చెప్పండి ప్రజా సంఘాల డిమాండ్..
కొమ్మాది:
కొమ్మాది, బక్కన్నపాలెం,రేవల్లుపాలెం రైతులకు న్యాయం జరిగే వరకూ చేసే పోరాటంలో వారికి మద్దతుగా నిలబడ తామని ప్రజా సంఘాల నాయకులు తెలియ జేశారు.ఆదివారం జవహర్ నవోదయ విద్యాలయం వద్ద నిర్మించిన హూద్ హూద్ ఇల్లు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం జరిగిన సమావేశంలో సీఐటీయూ మధురవాడ జోన్ ప్రధాన కార్యదర్శి పీ రాజ్ కుమార్,వివేకానంద కాలని,బాపూజీ నగర్ కాలనీల నుండి ఎస్ రామప్ప డు, జి కిరణ్,డి రవికుమార్,పాల్గొని తమ మద్దతు తెలియ జేశారు.ఈ సందర్భంగా రాజు కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకుని ఇస్తామన్న ఇల్లు కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.రైతుల న్యాయ మైన పోరాటానికి మద్దతు గా నిలబడ తామాని తెలియజేశారు.అనంతరం సీపీఎం జోన్ కార్యదర్శి డీ అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులు రైతులకు తప్పకుండా ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కేటాయించక పోవడం అన్యాయమని అన్నారు.
పేదలు,దళితుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా స్థానిక తాహిసిల్దారు,ఏ పి స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వ్యవహరించడం తగదని అన్నారు.రైతులకు మద్దతుగా ప్రజా సంఘాల ను కూడా గట్టి పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు.విశాఖ రూరల్ తహశీల్దారు కార్యాలయం వద్ద ఇండ్లు అప్పా చెప్పే వరకు నిరవధిక ఆందోళన,రిలే నిరాహారదీక్షలు చేస్తామని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జోన్ కార్యకర్తలు కే నాగరాజు,ఎస్ పైడి తల్లి,ఎస్ శంకర్,ఎస్ నాగరాజు,పిల్ల అప్పలనారసమ్మ,చిన్నమ్మాలు,ఎస్ నరసియ్యామ్మ,పి అంకయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.