జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజలు


చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శ్రావణ శోభ

జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజలు 


మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్

మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు మీద కొలువైవున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు శుభకృత్ నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్ల పక్షం  తిథి పాడ్యమి శుక్రవారం అమ్మవారికి నిత్యార్చనతో పూజలు ప్రారంభించి, ప్రత్యేక కుంకుమార్చన, పుష్పార్చన,  మొదలగు పూజ కార్యక్రమాలు   ఆలయ ప్రధాన అర్చకులు, పట్నాల సుబ్బారావు శర్మ, ,పట్నాల హరి ప్రసాద్ శర్మ, పట్నాల రాంబాబు శర్మ, హరి చరణ్,హరి స్వామి, శంకర్ స్వామి తదితరులు జరిపించడం జరిగింది, మరియు సాయంత్రం అమ్మవారికి పంచామృత సుగంధ జలాభిషేకం జరిపించి, ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది,మధురవాడ చంద్రంపాలెం వాస్తవ్యులు పిళ్లా సూరిబాబు వరలక్ష్మి, వెంకట రమణ, వరలక్ష్మి దంపతులు ఆర్ధిక సహాయం ఏర్పాటు చేసిన పులిహోర ప్రసాదమును భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు  పంపిణీ చేయడం జరిగింది, అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి  ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు,

ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు,  సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, సభ్యులు పిళ్లా వెంకటరమణ,  పోతిన పైడిరాజు,పిళ్లా రమణ,బైపిల్లి సురేష్, పొట్నూరి హరికృష్ణ, పిళ్లా మోహన్ శివ కృష్ణ, ,కేశనకుర్తి అప్పారావు, యన్.అప్పలరాజు, గ్రామ పెద్దలు పీస రామారావు, ముఖ్య సభ్యులు పిళ్లా అప్పన్న, పిళ్లా పోతరాజు, యమ్.వెంకటరావు, యస్.శ్యామ్, పిళ్లా రాజు, తదితరులు పాల్గొన్నారు.