మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్
బి టి ఏ విశాఖ జిల్లా నూతన కమిటీ అధ్యక్షులు గండి ప్రకాష్ బాబు ఎన్నిక
విశాఖపట్నం జిల్లా బి టి ఏ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ఏ వెంకటరమణ అధ్యక్షతన చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా బి టి ఏ (బహుజన టీచర్స్ అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్షులు మీ మనోజ్ కుమార్ ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి వెంకట్రావు ,రాష్ట్ర ట్రెజరర్ ఎల్ ఆంటోనీ ,డిప్యూటీ సెక్రటరీ జనరల్ రాష్ట్ర బాధ్యులు ఎన్నికల అధికారులుగా విచ్చేసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా విశాఖ జిల్లా నూతన కమిటీ అధ్యక్షులు గండి ప్రకాష్ బాబు,ప్రధాన కార్యదర్శి పారుపల్లి భీమారావు, ట్రెజరర్ ఎస్ పాండవులు, గౌరవాధ్యక్షులు గోవాడ వీర్రాజు, ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ వారిని మరియు రాష్ట్ర బీటీఏ కమిటీ రాష్ట్ర కౌన్సిల్ కు ఏ వెంకటరమణ ని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది