చురుకుగా 5వ వార్డ్ లో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం.

చురుకుగా 5వ వార్డ్ లో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం.

మధురవాడ:

ముఖ్యఅతిథిగా హాజరై సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించిన కార్పోరేటర్ మొల్లిహేమలత. 

 మధురవాడ : జీవీఎంసీ 5వవార్డ్ పరిధి  శారదనగర్(మారికవలస), పరదేశి పాలెం, అంబేద్కర్ నగర్ కాలనీ, స్వతంత్రనగర్,బోరవానిపాలెం లలో కార్పోరేటర్ మొల్లిహేమలత.వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ(జపాన్), నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి,ఈగలరవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా హాజరై సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించిన కార్పోరేటర్ మొల్లిహేమలత మాట్లాడుతూ..టీడీపీ కుటుంబసభ్యులు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలనికోరారు,టిడిపి సభ్యత్వ నమోదువలన చాలా లబ్ది చేకూరుతుందని తెలిపారు.తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలను గుర్తించేందుకు ఈసభ్యత్వం ఉపయోగపడుతుందని, కష్టపడే కార్యకర్తకు అండగా టిడిపి ఎల్లవేళలా వెన్నంటి ఉంటుందని,క్రియాశీల కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించడం,సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొన్ని లక్షల మంది క్రియాశీలకార్యకర్తలను చేర్చుకోవడమేలక్ష్యం అని తెలియజేశారు.
ప్రతిసభ్యునికి సభ్యత్వకార్డు తప్పనిసరని, క్రియాశీల కార్యకర్తలందరికీ రూ.2లక్షల బీమాసౌకర్యం. ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరితే రూ40వేల రీయింబర్స్మెంట్.నిర్దేశిత ఆసుపత్రులలో వైద్య ఖర్చులపై రాయితీలు,ఇంకా మరెన్నో బీమాసౌకర్యాలు.దేశంలో ఏ పార్టీ ప్రవేశ పెట్టని టీడీపీ సభ్యత్వ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  యువత అధ్యక్షులు కొండపురాజు,వియ్యపు నాయుడు,సీనియర్ నాయకులు బొరఅప్పలసూరి ముబాబురెడ్డి,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, సీనియర్ నాయకులు ఆనందరావు, సంతోష్, ఎర్ర నాయుడు, అప్పన్న, బోరసూర్యచంద్రుడు,ఎర్రయ్య రెడ్డి, ఉపాధ్యక్షులు కంబపుకామరాజు,చక్రి,ఓలేటి శ్రావణ్, జోగేశ్వరపాత్రో, కొత్తలశ్రీను, దిబ్బ శ్రీను మరియు తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.