ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.(28 th July World Nature Conservation Day)
విశాఖ జిల్లా ఆనందపురం మండలo లో వెల్లంకి గ్రామంలో బిజేపి కిసాన్ మోర్చ ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్,పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భూగోళంపై ప్రతి జీవీ ప్రకృతిపై ఆధారపడి జీవిస్తుంది.గాలినీరు,నేల,అడవు లు,* *ఖనిజ సంపదతోపాటు* *బొగ్గు,*పెట్రోలియం,**సహజ వాయువులు*వంటి *శిలాజ* ఇంధనాలు ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు...!ఇవి పర్యావరణంలో భాగంగా ఉంటూ మానవులు, జంతువులు, ఇతర జీవరాశుల మనుగడకు తోడ్పడతాయి.ఒక దేశం భౌగోళిక ఉనికి, ఆర్థికాభివృద్ధిని అక్కడి సహజ వనరులు ప్రభావితం చేస్తాయి.
భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలావరకు పరిమితమైనవి...!స్వార్థపూరిత ఆలోచనతో మానవాళి వీటిని *అపరిమితంగా* వాడటంతో ప్రకృతి మనుగడే ప్రమాదంలో పడింది. ఫలితంగా భూగోళంపై జీవజాతుల ఉనికి* అగమ్యగోచరంగా మారుతోంది. అందరం ప్రకృతిని ప్రేమిద్దాం మొక్కలు నాటుదాం. ప్రజలు భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుదాం.